ములుగు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ఐకెపీ సెంటర్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. గన్ని బ్యాగ్స్ లేక..కాంటాలు పెట్టకా ధాన్యాన్ని ఐకెపీ సెంటర్లోనే ఉంచారు. రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం కుప్పల మధ్య నీరు నిలిచిపోవడం వల్ల ఇంజన్లతో నీటిని బయటికి తరలించారు. తడిసిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!