ములుగు జిల్లాలో వాజేడు, వెంకటాపురం, మంగపేట ఏటూరునాగారం మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆదివారం నుంచి వరుణుడు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉన్నాడు. నిన్నటి నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. చేతికందొచ్చిన పంట తడిసి ముద్దవుతుంటే రైతుల గుండెలు చెరువవుతున్నాయి.
ఇదీ చూడండి: 'ఆడపిల్లలను ఏడిపిస్తే ఎవర్నీ వదలొద్దు'