ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని టీఎస్పీఎస్సీ ఐదో బెటాలియన్ క్యాంపు నిర్మాణాలపై రైతులు దాడికి యత్నించారు.
బెటాలియన్ నిర్మాణం కోసం సుమారు 150 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలు మినహా మిగిలిన భూమిని తమకు అప్పగించాలంటూ రైతులు గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్లనే నిర్మాణాలపై దాడిచేసినట్లు రైతులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ సాయి చైతన్య అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. నిర్వాసితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.