ETV Bharat / state

Distribution of goods to flood victims : స్వచ్ఛంద సంస్థల దాతృత్వం.. వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ - telangana floods 2023

Distribution of goods to flood victims : హైదరాబాద్​కు చెందిన ఈస్ట్ జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు మానవత్వం చాటుకున్నారు. ములుగు జిల్లా వరద బాధితులకు పదిరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏటూరు నాగారం ఐటీడీఏ కేంద్రం వద్ద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

flood victims in mulugu
Distribution of goods to mulugu district
author img

By

Published : Aug 4, 2023, 8:25 PM IST

Distribution of goods to flood victims : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన కుండపోత వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. ఏటూరునాగారం మండలంలోని దొడ్ల, మల్యాల, కొండాయి గ్రామాలను తీవ్రంగా వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇళ్లు కొట్టుకుపోయి.. ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వీరి కష్టాలు చూసి చలించిన పలువురు మానవతావాదులు వీరికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.

Mulugu Floods 2023 : వరద ముంచెత్తింది.. కొండాయి గ్రామం గుండె పగిలింది

హైదరాబాద్​కు చెందిన రియల్​ ఎస్టేట్​ సంస్థ.. గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల సహాకారంతో ఐటీడీఏ ఏటూరు నాగారం వద్ద 280 మందికి.. నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బాధలో ఉన్న వారికి సహాయం చేయడం ఎంతో గర్వంగా ఉందని బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మరింత మంది సహాయం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Roads Damage in Mulugu District : భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు.. నిలిచి పోయిన రాకపోకలు

Mulugu Flood Victims : దేశంలోనే మొదటిసారి ఒక్కరోజులోనే అత్యధిక వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైందని టీఎస్​ రెడ్​కో చైర్మన్​ సతీష్​ తెలిపారు. ముంపు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. నష్టపోయిన బాధితులకు పరిహారం ఇవ్వనున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ఇక్కడి ప్రజల దుస్థితిని చూసి సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం నిజంగా హర్షణీయమన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

ఇటీవల వర్షాలకు ములుగు జిల్లా భారీగా అతలాకుతలమైంది. ఎటు చూసినా కొట్టుకుపోయిన రోడ్లు, పొలాల్లో ఇసుక మేటలు, దెబ్పతిన్న పంటలు, కూలిన ఇళ్లతో దయనీయంగా మారింది. ప్రభుత్వ సాయానికి తోడు మానవతావాదులు అందిస్తున్న ఆపన్నహస్తమే ఇప్పుడు వరద బాధితులకు కొండంత భరోసా.

"మేము టీవీలలో ములుగు జిల్లా ముంపునకు గురైన ప్రజల ఇబ్బందులను చూశాము. మా వంతుగా ఏమైనా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ తరఫున.. వరద బాధితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశాము. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులు ఈ పంపిణీ కార్యక్రమంలో సహకరించారు". - మొరుశెట్టి శ్రీనివాస్ గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్

"దేశంలో ఒక్కరోజులోనే అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాగా ములుగు జిల్లా నిలిచింది. ఇక్కడి ప్రజలు సమస్తం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వీరి పరిస్థితిని చూసి స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్​కు చెందిన గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇంకెవరైనా దాతలు ఉంటే జిల్లాలో ఉన్న వరద బాధితులకు సహకరించాలి". - సతీశ్​ టీఎస్​ రెడ్​కో ఛైర్మన్​

Distribution of goods to flood victims : ములుగు వరద బాధితులకు సరుకుల పంపిణీ

Satyavathy Rathore on flood victims : "ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం"

Minister Satyavathi Visited Mulugu : 'వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.