ములుగు జిల్లా పరిపాలన కార్యాలయంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 9 మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సమస్య ఉంటే త్వరితగతిన పనులు పూర్తిచేసి గ్రామంలో నీరు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యూ.ఎస్, మిషన్ భగీరథ ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. దూర దృశ్య సమీక్ష ద్వారా భూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.
ఇవీ చూడండి:అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా: చంద్రశేఖర్