ETV Bharat / state

MOTHER DIED: కుమారుడి మరణం... ఆగిన తల్లి హృదయం... ఎక్కడంటే - కొడుకు మరణం తట్టుకోలేక తల్లి మృతి వార్త

MOTHER DIED: కొడుకు అంటే ఆ అమ్మకు ఎక్కడలేని ప్రేమ. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది. అతను అనారోగ్యం బారినపడటంతో కుంగిపోయింది. ఉన్నట్టుండి కుమారుడు తనను వదిలి వెళ్లిపోయాడని తెలుసుకుని గుండెలవిసేలా రోదించింది. ఆ బాధను భరించలేకపోయిందో ఏమో ఆ మాతృమూర్తి హృదయం ఆగిపోయింది. ఈ ఘటన ఉప్పల్ పరిధిలో చోటుచేసుకుంది.

SON DIED EFFECT WITH MOTHER DIED HYDERABAD
కుమారుడి మరణం తట్టుకోలేక తల్లి మృతి
author img

By

Published : Feb 12, 2022, 12:13 PM IST

MOTHER DIED: ఆ తల్లికి కొడుకు అంటే ప్రాణం నవమాసాలు మోసి పెద్ద చేసిన ఆ కుమారుడు మృతి చెందాడు. మరణవార్త విన్న తల్లి గుండె ముక్కలైంది. కొడుకు మరణం తట్టుకోలేక ఆ మాతృమూర్తి హృదయం ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని రామంతాపూర్​లో చోటుచేసుకుంది. ఒకే రోజు తల్లి కొడుకు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివేక్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, భాజపా సీనియర్ నేత బండ సత్యనారాయణ(50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఇంట్లోనే ఉంటున్న తల్లి కిష్టమ్మ(85) కుమారుడి మరణ వార్త తెలుసుకుని మనస్తాపం చెందింది. మధ్యాహ్నం కొడుకు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న సమయంలో చివరి చూపు కోసం ఆమెను బంధువులు భౌతిక కాయం వద్దకు తీసుకొని వచ్చారు. అదే సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. బంధువులు వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందింది.

ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్​వీఎస్​ఎస్​ ​​ప్రభాకర్, కార్పొరేటర్ బండారు శ్రీవాణి, డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, తదితరులు నివాళులు అర్పించారు. అంబర్​పేట వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: Judgment in a rape case: 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.