వేసవికాలం రాకముందే ప్రజలను నీటి కష్టాలు పలకరిస్తున్నాయి. నాగారం వాసులు తాగునీటి కోసం ఏడాది నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎండలు మండిపోతే పరిస్థితేంటని ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.
తాగునీటికై తంటాలు
By
Published : Feb 17, 2019, 7:19 PM IST
తాగునీటికై తంటాలు
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 108 కాలనీల ప్రజలు ధర్నాకు దిగారు. నాగారం నుంచి రాంపల్లి చౌరస్తా వరకు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.
మంజీరా, గ్రామ పంచాయతీ నీరు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.