ETV Bharat / state

లాటరీ స్కీమ్​ పేరుతో కోటిన్నరకు టోకరా

నెలనెలా ఒక్కొక్కరితో రూ. 1000 కట్టించుకున్నాడు. అలా 8నెలల్లో సుమారు కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి ఓ సంస్థ నిర్వాహకుడు ఉడాయించాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు సదురు సంస్థ కార్యాలయం ముందు ఆందోళకు దిగారు.

కోటిన్నరకు టోకరా
author img

By

Published : Jul 26, 2019, 5:48 PM IST

లాటరీ స్కీమ్​ పేరుతో ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసి ఉడాయించిన ఘటన మేడ్చల్ జిల్లా బాలానగర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు సుమారు 100 మంది సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన గోపాల్​రావు 15 సంవత్సరాల క్రితం భార్య, పిల్లలతో కలసి నగరంలో స్థిరపడ్డాడు.

సంస్థ ఏర్పాటు చేసి..

బాలానగర్ పరిధిలోని పద్మానగర్ ఫేస్ -1లో ఓ షాపును అద్దెకు తీసుకొని మరో ముగ్గురు వ్యక్తులు నరేందర్​, శివ, సత్యం భాగస్వాములుగా "వినాయక ఎంటర్‌ప్రైజెస్ " అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 2000 మంది సభ్యులతో లాటరీ స్కీమ్ పెట్టారు. ఒక్కొక్కరితో నెల నెల రూ. 1000/- కట్టించుకుంటూ.. ప్రతినెల 10మంది సభ్యులకు లాటరీ స్కీమ్ ద్వారా గిఫ్ట్​లు ఇచ్చేవారు.

8నెలల్లో కోటి అరవై లక్షలు..

మూడు నెలల క్రితం ముగ్గురు భాగస్వాములు నిందితుడు గోపాల్​రావుతో విడిపోయి వేరే బోగస్ సంస్థను ఏర్పాటు చేసుకున్నా... గోపాల్ మాత్రం 'వినాయక ఎంటర్‌ప్రైజెస్ ' సంస్థను కొనసాగిస్తూ వచ్చాడు. 8నెలలలో సుమారు కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసాడు. ఈరోజు సభ్యుల సమక్షంలో లాటరీ తీయకుండా కార్యాలయం మూసివేసి ఉండటం వల్ల సుమారు 100మంది బాధితులు గోపాల్​రావు ఇంటిముందు ఆందోళన చేపట్టారు. బోగస్ సంస్థ నిర్వాహకున్ని వెంటనే అరెస్టు చేసి.. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

కోటిన్నరకు టోకరా

ఇవీ చూడండి: 'కొత్త అసెంబ్లీ నిర్మాణ నమూనాలు ఇంకా ఖరారు కాలేదు'

Intro:Tg_Hyd_22_26_Lottery mosam_AV_TS10011

మేడ్చల్ : బాలానగర్

Anchor: "లాటరీ స్కీమ్" లో నెల నెల తమతో వెయ్యి రూపాయలు కట్టించుకొని నేడు లాటరీ తీయకుండా లాటరీ నిర్వహికుడు సంస్ద బోర్డ్ తీసివేయడంతో పాటు కార్యాలయంను కూడా మూసి వేయడంతో సుమారు 100మంది స్కీమ్ కట్టిన బాధితులు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన సంఘటన బాలనగర్ పియస్ పరిధిలో చోటుచేసుకుంది...
Body:Voice: ఖమ్మం జిల్లా, వైరా ప్రాంతానికి చెందిన గోపాల్ రావు 15 సంవత్సరాల క్రీతం భార్యా, పిల్లలతో నగరానికి వచ్చి కారు డ్రైవర్ గా పనిచేస్తుండే వాడు. క్రితం సంవత్సరం బాలానగర్ పియస్ ప్రాంతంలోని పద్మానగర్ ఫేస్ -1 లో ఓ షాపును అద్దేకు తీసుకొని మరో ముగ్గురు(Narendhar, Shiva, Satyam) పార్ట్నర్స్ తో కలిసి మొత్తం నలుగురు "వినాయక ఎంటర్‌ప్రైజెస్ " అనే సంస్థను ఎర్పాటు చేసి, 2000 మంది సభ్యులతో లాటరీ స్కీమ్ పెట్టి, వీరితో నెల నెల 1000/- రూపాయలు కట్టించుకుంటూ, ప్రతినెల 10మంది సభ్యులకు లాటరీ స్కీమ్ ద్వారా వీరికి గిఫ్ట్ ఇచ్చేవాడు. మూడు నెలల క్రీతం ముగ్గురు పార్ట్నర్స్ నింధితుడు గోపాల్ రావుతో విడిపోయి, వేరే బోగస్ సంస్దను ఏర్పాటు చేసుకున్నా... గోపాల్ రావు మాత్రం 'వినాయక ఎంటర్‌ప్రైజెస్ ' సంస్దనే కొనసాగిస్తూ 8నెలలలో సుమారు కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసాడు. ఈ రోజు సభ్యుల సమక్షంలో లాటరీ తీయకుండా కార్యాలయంను మూసివేసి, కార్యాలయంకు బోర్డు కూడ లేకుండ ఉండటంతో సుమారు 100మంది బాధితులు గోపాల్ రావు ఇంటిముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇలాంటి భోగస్ సంస్ద నిర్వహికున్ని వెంటనే అరెస్టు చేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు..

కుత్బుల్లాపూర్‌: బాలనగర్ పియస్ పరిధి, పద్మానగర్ ఫేస్-1 లొని "వినాయక ఎంటర్‌ప్రైజెస్ " అనే సంస్ద తమ వద్ద నెల నెల వెయ్యి రూపాయలు కట్టించుకొని నేడు సంస్ద బోర్డ్ తీసేసి తమను మోసం చేసారని సుమారు 100 మంది రోడ్డు పై బైటాయింపు...ఆందోళన ...Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.