ETV Bharat / state

'కష్టకాలంలోనూ సంక్షేమంలో రాజీ పడేది లేదు'

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చెక్కులను ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దుండిగల్ పురపాలిక పరిధికి చెందిన 58మందికి సుమారు రూ.58,06,728 విలువ గల చెక్కులను అందజేశారు.

author img

By

Published : Sep 19, 2020, 6:38 AM IST

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన 58 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చెక్కులను ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పంపిణీ చేశారు. పథకాల కింద సుమారు రూ.58,06,728 విలువ గల చెక్కులు మంజూరయ్యాయి.

క్లిష్ట సమయంలోనూ..

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన 58 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.58,06,728 విలువ గల చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఎక్కడా లేని పథకాలు..

దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ సర్కార్ అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, పథకాలకు ఏ లోటు రాకుండా పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తోందన్నారు.

ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..

పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందంటే సీఎం కేసీఆర్ పనితీరే కారణమని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్వో భూపాల్, కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు.

ఇవీ చూడండి : జలకళతో తొణికిసలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.