మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సికింద్రాబాద్ కార్ఖానాలోని కేజేఆర్ గార్జెన్స్లో హైదరాబాద్ నగర పోలీసులు, రెడ్‌క్రాస్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. రక్తదానం చేస్తున్న వారిని ఆయన అభినందించారు. పోలీసుల సేవలకు గుర్తింపుగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ధ్రువపత్రాలను అందజేశారు.
కరోనా సమయంలో పోలీసు సిబ్బంది.. కుటుంబాలను సైతం వదిలి అద్భుతమైన సేవలు అందించినట్లు పేర్కొన్నారు. వైరస్ కట్టడి విషయంలో ప్రభుత్వానికి, పోలీసులకు ప్రజలు బాగా సహకరించాలని, ప్రస్తుతం కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. రక్తదానం చేసే వారు ఇతరుల ప్రాణాలు కాపాడిన వారవుతారని రక్తదాతలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ వ్యూహరచన