ETV Bharat / state

Bhatti on Chinthan Shibir: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చింతన్ శిబిర్: భట్టి విక్రమార్క - చింతన్ శిబిర్​లో భట్టి

Bhatti on Chinthan Shibir: చింతన్ శిబిర్‌లో అందరి నేతల అభిప్రాయాలు తీసుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని కమిటీలతో సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కీసరలోని కాంగ్రెస్ పతాకావిష్కరణ చేసిన భట్టి.. పీసీసీ నవసంకల్ప మేథోమధన శిబిరాన్ని ప్రారంభించారు.

Bhatti on Chinthan Shibir
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
author img

By

Published : Jun 1, 2022, 1:42 PM IST

Bhatti on Chinthan Shibir: చింతన్‌ శిబిర్​ తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌పై రెండు రోజులపాటు ఈ శిబిర్‌లో చర్చిస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కీసరలోని బాల వికాస కేంద్రంలో పీసీసీ నవసంకల్ప మేథోమధన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను చింతన్ శిబిర్​లో చర్చిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై అన్ని కమిటీలతో చర్చించి నివేదిక తయారు చేస్తామని వెల్లడించారు. ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కాలేదని భట్టి స్పష్టం చేశారు. రెండు రోజులపాటు చింతన్ శిబిర్ కమిటీ సమావేశం కొనసాగుతుందని తెలిపారు.

ఉదయపూర్‌ డిక్లరేషన్‌పై చర్చించడమే ప్రధాన అజెండాగా రెండ్రోజుల పాటు చింతన్ శిబిర్ కమిటీ సమావేశం కొనసాగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి 6 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన పీసీసీ... అన్ని అంశాలపై చర్చించిన నివేదికను ఏఐసీసీకి పంపించనున్నట్లు వెల్లడించారు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు, ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, పార్టీ బలోపేతం, యువత, ఆర్థికం, సామాజిక న్యాయం, రాజకీయం వంటి 6 అంశాలపై సమగ్రంగా చర్చించేలా పీసీసీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలనే లక్ష్యంతో ఈ మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జి మాణికం ఠాగూర్‌, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ, కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్సులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ సమావేశంలో పాల్గొన్నారు.

అప్పుల రాష్ట్రంగా మార్చారు: రానున్న ఎన్నికలకే లక్ష్యంగా నవసంకల్ప మేథోమధన శిబిరం కొనసాగుతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఉదయ్‌పూర్‌లో తీసుకున్న అంశాలపై ఈ శిబిరంలో తీర్మానం ఉంటుందని పేర్కొన్నారు. కీసరలో నిర్వహిస్తున్న చింతన్ శిబిర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతనే ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోందని మండిపడ్డారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఉత్తమ్ ఆరోపించారు.

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చింతన్ శిబిర్: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.