జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు పిల్లలతో కలిసి ప్రచారం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రచారం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఏమీ తెలియని పిల్లలను వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లలను చిన్నప్పటి నుంచే రాజకీయ ద్వేషాలకు అలవాటు చేసినట్లు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదా అని స్థానికులు ప్రశ్నించారు. చర్లపల్లి 3వ డివిజన్, మౌలాలి 138 డివిజన్లో పిల్లలతో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: నీటి బిల్లులు మాఫీ అయితే మీటర్లు ఎందుకు?: ఎంపీ అర్వింద్