మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆనంద్‌బాగ్‌లో విషాధ ఘటన చోటుచేసుకుంది. వెంకట్ప్లాజాలో కారు కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. కారు వెనుక ఆడుకుంటున్న తరుణ్‌ను గమనించకుండా వాహనాన్ని డ్రైవర్ వెనక్కి తీయడం వల్ల చక్రాల కిందపడి బాలుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు'