కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు వచ్చి నివాసం ఉంటోంది. ట్రాక్టర్ డ్రైవర్(45)గా పని చేస్తున్న ఇంటి పెద్ద.. గురువారం హైదరాబాద్‌లోని బొగ్గులకుంట కూడలిలోని కాలిబాటపై మృతి చెందాడు. అతని వద్ద లభించిన ఆధారాలతో నారాయణగూడ పోలీసులు మేడిపల్లి స్టేషన్‌కు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసుల సమక్షంలో జీహెచ్ఎంసీ రాత్రికి రాత్రే దహన సంస్కారాలు పూర్తి చేసింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ విషయమై 'కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం' అనే శీర్షికతో ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి మేడ్చల్ జిల్లా కీసర డివిజన్ ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది శిక్షకులు వీపూరి రవికుమార్ స్పందించారు. శనివారం మృతుడి భార్యను కలిసి వారానికి సరిపడా నిత్యావసర సరకులు, పిల్లలకు బిస్కెట్లు, నగదు రూ.1000 అందజేశారు.
ఇదీ చూడండి : కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం