ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు మెదక్- రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆందోళనకు దిగారు. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ ఆంతర్యం ఏంటని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాధా కిషన్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరిన 11 మంది కార్మికులు వారి ఇష్టానుసారంగా చేరలేదని తెలిపారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకే విధుల్లో చేరినట్లు స్పష్టం చేశారు. వెంటనే తమ సమస్యలను పరిగణలోకి తీసుకొని ఐకాస నాయకులతో చర్చలు జరిపాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?