ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు రక్షించారు. కోమటిపల్లికి చెందిన అనిల్... లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎన్‌హెచ్-44 పక్కన అనిల్... చెట్టుకు చొక్కాతో ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో రహదారి వెంట వెళ్లే వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలిని చేరుకున్న పోలీసులు అనిల్‌కు నచ్చజెప్పి కిందకి దింపారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న అనిల్ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. సమస్యలకు తోడు తన యజమాని వేతనం ఇవ్వకుండా సతాయించటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఏది ఏమైనా.... పోలీసులు వెంటనే స్పందించటం వల్లే నిండు ప్రాణం నిలిచిందని పలువురు ప్రశంసిస్తున్నారు.