ETV Bharat / state

'కందిపప్పును కొనలేం.. మీరే అందించాలి'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 10 కిలోల రేషన్ బియ్యంతో పాటు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తున్నారు. జులై మాసం నుంచి కందిపప్పు నిలిపివేశారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

http://10.10.50.85:6060/reg-lowres/18-August-2020/tg-srd-41-18-ration-kandipapu-avb-ts10115_18082020092628_1808f_00194_560.mp4
పేదలు
author img

By

Published : Aug 18, 2020, 12:48 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 10 కిలోల రేషన్ బియ్యంతో పాటు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తున్నారు. బియ్యం పంపిణీ సాఫీగా జరుగుతున్నప్పటికీ... కందిపప్పు మాత్రం జూన్ వరకు మాత్రమే పంపిణీ చేశారు. జులై మాసం నుంచి కందిపప్పు నిలిపివేశారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో 20 మండలాలకు గాను 521 రేషన్ దుకాణాలు ఉండగా.. 213,559 కార్డులకు గాను 7.24 లక్షల మందికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం కుటుంబానికి కిలో కందిపప్పు ఇచ్చారు.

జులై మాసం నుంచి కందిపప్పును నిలిపివేశారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో ధర రూ. 100 నుంచి రూ. 110 వరకు ఉందని తాము కొనలేమని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం ఉచితంగా కందిపప్పును పంపిణీ చేయాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.