ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

మెదక్‌ జిల్లా చేగుంట, నార్సింగి మండల కేంద్రాలలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేయగా.. ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి మెదక్‌ జిల్లాలోనే ప్రథమ స్థాయిలో ఉంచాలని ఆకాంక్షించారు.

రైతు వేదికలు జిల్లాలోనే ప్రథమ స్థాయిలో ఉంచాలి: ఎమ్మెల్యే

author img

By

Published : Jun 29, 2020, 11:11 PM IST

మెదక్‌ జిల్లా నార్సింగిలో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పలువురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

చేగుంట, నార్సింగి మండలాలలో రైతు వేదిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి మెదక్ జిల్లాలోనే ప్రథమ స్థాయిలో నిలిచేలా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామాలను హరిత వనంగా తీర్చిదిద్దాలని కోరారు. వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టి.. భావి తరాలకు మంచి గాలిని ఇవ్వాలన్నారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.