హరితహారంలో భాగంగా ఐదేళ్లలో 182 కోట్ల మొక్కలు నాటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా 30 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పానికి పూనుకున్నామని తెలిపారు. 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి తీసుకెళ్లడం సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సంకల్పానికి అందరు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం