ETV Bharat / state

దేవాలయ భూముల్లో అక్రమాలకు చెక్ పెట్టండి: కలెక్టర్

మెదక్ జిల్లా నర్సాపూర్​లో కలెక్టర్​ హరీశ్​ పర్యటించారు. పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Mar 18, 2021, 12:21 PM IST

medak Collector Harish visited Narsapur municipality
దేవాలయ భూముల్లో అక్రమాలకు చెక్ పెట్టండి: కలెక్టర్

నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నామని మెదక్​ కలెక్టర్ హరీశ్ తెలిపారు​. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పట్టణంలో.. 3 నెలల్లో చేపట్టబోయే అభివృద్ధిపై ప్రణాళికను తయారు చేస్తున్నామని కలెక్టర్​ వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. దేవాలయ భూముల్లో అక్రమాలకు పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​ మాలతీని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​ అనసూయ, మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నయీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'కరోనా కేసులు పెరుగుతున్నాయి.. బీ అలర్ట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.