రాష్ట్రంలో పదోన్నతులు, బదిలీలు సత్వరమే చేపట్టాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని జాక్టో ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపుతో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులందరూ ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో నూతన వేతనాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.