మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో గోదా సమేత రంగనాయక స్వామి కల్యాణం బుధవారం ఘనంగా జరిగింది. వేదమంత్రాల నడుమ వైభవంగా జరిగిన ఈ కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కల్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోదండ రామాలయం అధ్యక్షుడు బండా నరేందర్, కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై