ETV Bharat / state

Organs Donation : అవయవదానంతో చిరంజీవి అయిన బాలుడు.. - బాలుడు అవయువాలు దానం చేసిన తల్లిదండ్రులు

Organs Donation : తాను ఊపిరి విడిచి... ఐదుగురికి ఆయువు పోశాడో బాలుడు. పాఠశాలకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్​డెడ్​ అయిన బాలుడి అవయవాలను మరో ఐదుగురికి దానం చేశారు. ఈ ఘటన మెదక్​ జిల్లా టీ మాందాపూర్​లో జరిగింది.

Boy
Boy
author img

By

Published : Feb 16, 2022, 7:59 PM IST

Organs Donation : మెదక్​ జిల్లా చిన్న శంకరంపేట మండలం టీ మాందాపూర్​కు చెందిన లోకేశ్​ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గాయపడిన లోకేశ్​ను హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బాలుడు బ్రెయిన్​డెడ్​ కావడంతో అతడి అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చాడు.

పుట్టెడు దుఃఖంలో ఉన్న బాలుడి తల్లిదండ్రులు రాములు, మంజుల.. తమ కుమారుడి కళ్లు, కిడ్నీలు, కాలేయం దానం చేసేందుకు ముందుకొచ్చారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మృతి చెందినా ఐదుగురికి అవయువదానం చేసి.. చిరంజీవిగా నిలిచాడు లోకేశ్​.

ఇదీ చూడండి : చనిపోయి కూడా తొమ్మిది మందికి జీవితాన్నిచ్చింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.