మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగాయపల్లిలో మద్యం నిషేధించాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చిన యువకులపై మద్యం అమ్మకందారులు దాడి చేశారు. వారి ఇళ్లను ధ్వంసం చేసి వాహనాలు తగులబెట్టారు. ఇంట్లో ఉన్న మహిళలను గాయపరిచారు. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు మరోసారి ఇరువర్గాలు దాడికి యత్నించాయి. ఇరు వర్గాలను చెదరగొట్టి గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
- ఇదీ చూడండి : లక్ష రూపాయలిచ్చినా వేధింపులు ఆపని కులపెద్దలు