ETV Bharat / state

నకిలీ ఐడీ కార్డులతో.. ఓట్లు వేశారంటూ ఆందోళన - Telangana Muncipall Elections News today news

మంచిర్యాల మున్సిపాలిటీలో నకిలీ ఐడీ కార్డులతో ఓట్లు వేసినట్లు స్థానికులు ఆరోపించారు. వేంపల్లి గ్రామానికి చెందిన పలువురిని.. కాంగ్రెస్ ఏజెంట్ పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.

with-fake-id-cards-worried-about-casting-votes
నకిలీ ఐడీ కార్డులతో.. ఓట్లు వేశారంటూ ఆందోళన
author img

By

Published : Jan 22, 2020, 6:15 PM IST

మంచిర్యాల మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హమలివాడలో 14,15,16 వార్డులలో.. కొందరు నకిలీ ఐడీ కార్డులతో ఓట్లు వేసినట్లు స్థానికులు ఆరోపించారు. వేంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పురుషులు, కొందరు మహిళలు పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి రాగా కాంగ్రెస్ ఏజెంట్ పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. వారి నుంచి ఐడీ కార్డులతో పాటు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అన్యాయంగా తమను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ.. బాధితులు ఆందోళనకు దిగటం వల్ల గందరగోళం నెలకొంది. మాటమాట పెరిగి అక్కడే ఉన్న తెరాస, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు గుంపును చెదరగొట్టారు.

నకిలీ ఐడీ కార్డులతో.. ఓట్లు వేశారంటూ ఆందోళన

ఇవీ చూడండి: ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.