మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై తెదేపా నాయకుడు సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ నియోజకవర్గంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకర్తలతో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన తీరుపై చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే పోలీసులు ఇందారం క్రాస్ రోడ్డు వద్ద తన వాహనాన్ని అడ్డుకొని రాత్రి వరకు స్టేషన్లో ఉంచారని కలెక్టర్‌కు తెలిపారు.