మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ భార్యభర్తల మధ్య జరిగిన కొట్లాట పోలీస్‌స్టేషన్‌కి చేరింది. పిలిచి కౌన్సిలింగ్ చేయాల్సిన పోలీసులు భర్త ముత్యాలును లాఠీతో విపరీతంగా కొట్టడం వల్ల చేతులపై, కాళ్లపై వాతలు పడి నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు.
లాఠీ విరిగేలా కొట్టాడు..
నేరేడ్ మెట్ అంతయ్య కాలనీలో నివసించే ముత్యాలు ఒక ప్రైవేటు ఉద్యోగి. నిన్న రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో భార్య కూకట్‌పల్లిలో ఉండే వాల్ల తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. అతను ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చి తనపై దాడి చేసి... వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితుడు వాపోయాడు. పోలీసులు వచ్చి ముత్యాలును స్టేషన్‌కి తీసుకెళ్లారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై సైదులు తనను ఏమి అడగకుండానే ఎటువంటి విచారణ జరపకుండానే... రాత్రి 11.30 గంటల సమయంలో లాఠీతో విపరీతంగా కొట్టాడని బాధితుడు ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ సైదులుపై రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చూడండి: ఏఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎవరికి 'రిజర్వ్' చేశారంటే!