హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఐబీ చౌరస్తాలో టపాసులు పేలుస్తూ... ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చే.. ప్రజలు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సైదిరెడ్డిని గెలిపించారని తెరాస శ్రేణులు అన్నారు.
ఇవీ చూడండి: హరియాణాలో ఏం జరుగుతోంది? అధికారం ఎవరిది?