ETV Bharat / state

మోదీ.. ఈ 30 ప్రశ్నలకు సమాధానం చెప్పాకే తెలంగాణకు రావాలి: భట్టి - నరేంద్ర మోదీ తాజా వార్తలు

Bhatti Vikramarka Letter to Narendra Modi: రాష్ట్ర విభజన హమీలపై ప్రధాని సమాధానం చెప్పాకే.. తెలంగాణకు రావాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన 30 ప్రశ్నలతో మోదీకి బహిరంగ లేఖ రాశారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka
author img

By

Published : Apr 7, 2023, 6:29 PM IST

మోదీ.. ఈ 30 ప్రశ్నలకు సమాధానం చెప్పాకే తెలంగాణకు రావాలి: భట్టి

Bhatti Vikramarka Letter to Narendra Modi: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం మేరకు తెలంగాణకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాకే.. ప్రధాని మోదీ రాష్ట్రానికి రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన పథకాలు, ప్రాజెక్టు వివరాలు చెప్పాలని ప్రశ్నించారు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ మేరకు రేపు తెలంగాణకు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో.. 30 ప్రశ్నలతో ఆయన మోదీకి బహిరంగ లేఖ రాశారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దుబ్బపల్లిలో భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్న మద్యం కుంభకోణం దర్యాప్తులో.. పురోగతి ఎందుకు లేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందించట్లేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని అన్నారు. వీటన్నింటికీ ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.

"తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి ఎందుకు స్పందించడం లేదు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయి." -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

రెండు పార్టీలు కలిసి డ్రామాలు: మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. బండి సంజయ్‌ అరెస్టును తెరపైకి తెచ్చి.. టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. టీఎస్​పీఎస్సీ కేసు నిందితులకు రాని బెయిల్‌.. పదో తరగతి ప్రశ్నాపత్రం కేసులో అరెస్టైన బండి సంజయ్‌కు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రతీసారి.. రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతుంటాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

ఇవీ చదవండి:

గిరిజనుల పోడు భూముల పట్టాలకై ముఖ్యమంత్రికి భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

రేపు హైదరాబాద్​కు ప్రధాని నరేంద్ర మోదీ.. ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీబిజీ

హనుమాన్​ జయంతి​ స్పెషల్​.. 16 కోట్ల సార్లు 'రామ' నామ జపం.. ప్రతి ఒక్కరూ లక్షకుపైగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.