వనపర్తి జిల్లా మెట్పల్లికి చెందిన చంద్రమ్మ దంపతులు పాత చీరలతో బొంతలను కుట్టి సంచార జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పుట్ట పల్లి గ్రామంలో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం తండ్రి ద్విచక్ర వాహనం మరమ్మతుల కోసం వెళ్లగా... తల్లి ఇంట్లో పనిచేసుకుంటోంది.
వారి రెండేళ్ల పాప అరవింద సమీపంలో ఉన్న శివాలయం కూడలిలో ఆడుకుంటుండగా... దేవరకద్రలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వచ్చి పాపను ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే మృతి చెందింది. తోటిపిల్లల అరుపులతో తల్లి వచ్చి బయట చూడగా... తమ కూతురు అచేతనంగా రక్తపు మడుగులో పడి ఉంది. చిన్నారి మృతదేహాన్ని ఎత్తుకొని తల్లి రోదించిన తీరు గ్రామస్థుల కంట కన్నీరు పెట్టించింది.
ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు