ETV Bharat / state

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో జరుగుతున్న కబడ్డీ పోటీలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు.

author img

By

Published : Apr 10, 2021, 8:45 PM IST

minister Srinivas  goud  visited kabaddi games in kurumurthi village
కురుమూర్తి గ్రామంలో జరుగుతున్న కబడ్డీ క్రీడాకారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో జరుగుతున్న కబడ్డీ పోటీలను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీక్షించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డితో కలిసి పాల్గొన్న మంత్రి... క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి అన్నారు.

గ్రామంలోని శ్రీ వీరహనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. నిర్వాహకుల కోరిక మేరకు మైదానంలోకి వచ్చిన మంత్రి... కబడ్డీ పోటీలను ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చూడండి: క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం: శ్రీనివాస్​గౌడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.