ETV Bharat / state

620 బృందాలతో జిల్లా వ్యాప్తంగా ఫీవర్​ సర్వే: శ్రీనివాస్​ గౌడ్​

మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా ఫీవర్​ సర్వే చేపట్టినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు. వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

minister srinivas goud review on covid situations in mahabubnagar
మహబూబ్​నగర్​ జిల్లాలో కొవిడ్​ పరిస్థితులపై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సమీక్ష
author img

By

Published : May 7, 2021, 11:26 AM IST

620 బృందాలతో మహబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన మంత్రి.. కొవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నూతనంగా ఎంపికైన 12మంది ఆయుష్ డాక్టర్లు, 31మంది స్టాఫ్ నర్సులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేయాలని వైద్యులకు, సిబ్బందికి సూచనలు చేశారు.

అన్ని సదుపాయాలు అందించాం..

కొవిడ్ బాధితుల కోసం ఇప్పటికే సుమారు 250 పడకలు, అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చామని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిల్లోనూ సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రులకు వస్తే వైద్యులు చేసేది ఏమీ ఉండదని సూచించారు.

పలు అభివృద్ధి పనులు

అంతకుముందుగా తన క్యాంప్ కార్యాలయంలో 117 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వీరన్న పేట 10వ వార్డులో రూ.100 కోట్లతో నిర్మిస్తున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. వీరన్నపేట్ రైల్వే గేట్ నుంచి రూ.కోటి 72 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. క్రిస్టియన్ పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. వైకుంఠ ధామం, నాయీబ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి: చిన్నారుల ఆసరాకు.. శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.