పట్టణాలు మురికి కూపాలుగా ఉండకూడదని వాటిని మరింత మెరుగు పర్చాలనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించారు.
గత ప్రభుత్వాలు విలీన గ్రామాలను పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని.. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ అభివృద్ది చేపడుతున్నామని అన్నారు. గతంతో పోలిస్తే పట్టణాల్లో జనావాసాలు పెరిగిపోవడం వల్ల రోడ్లు, డ్రైనేజీలు మరింత విస్తరించకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!