ETV Bharat / state

బధిరుల దరికి... ఆధునిక పరిజ్ఞానం - ఆధునిక పరిజ్ఞానం

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి చరవాణి, అంతర్జాల సేవల వినియోగం తప్పనిసరిగా మారింది. అదేవిధంగా రోజురోజుకు పెరిగిపోతున్న ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని బధిర (మూగ, చెవిటి) విద్యార్థులు, యువకులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బధిరుల దరికి... ఆధునిక పరిజ్ఞానం
author img

By

Published : Jul 7, 2019, 11:33 AM IST

Updated : Jul 7, 2019, 12:26 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలో ప్రస్తుతం ఇంటరు, ఆ పై కోర్సులు చదువుతున్న బధిర విద్యార్థులు, యువకులకు ఉచితంగా 4జీ స్మార్ట్‌ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గతంలో డిగ్రీ చదివే విద్యార్థులకు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధన సడలించారు. ఇంటరు, ఆ పై చదువులు చదివిన విద్యార్థులు, యువకులను అర్హతగా ప్రకటించింది. గతేడాది నుంచి ఈ కార్యక్రమం అమలవుతున్నా ఈ సంవత్సరం అర్హతలను సడలించి ఎక్కువ మంది బధిరులకు అందించేలా నిర్ణయం తీసుకుంది. బధిరులు వీటి ఆధారంగా అన్ని అవసరాలను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో వీటిని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్నారు.

mahabubnagar-district-badhirula-story
బధిరుల దరికి... ఆధునిక పరిజ్ఞానం

వికలాంగుల కార్పొరేషన్‌
ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రభుత్వం రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా 67 స్మార్ట్‌ చరవాణులను మంజూరు చేసింది. ఇందులో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు 10 చరవాణులు, వనపర్తి జిల్లాకు 10, మహబూబ్‌నగర్​కు 29, గద్వాలకు 10, నారాయణపేట జిల్లాకు 8 చొప్పున 4 జీ స్మార్ట్‌ చరవాణులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఇంటర్‌, ఆపై కోర్సులు చదువుతున్న బధిర విద్యార్థులు, యువకులు వీటికి అర్హులు.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో
బధిరులు వినియోగించుకోవడానికి వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన 4 జీ స్మార్ట్‌ చరవాణులను అందజేస్తున్నారు. ప్రధానంగా బధిరులు సంజ్ఞలతో తమ భావాలు, సమాచారాన్ని ఎదుటివారికి తెలియజేస్తుంటారు. వారు వినియోగించుకోవడానికి వీలుగా చరవాణుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వం పంపిణీ
బధిర విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 4 జీ స్మార్ట్‌ఫోన్లను అందజేస్తుంది. అంతర్జాలం ద్వారా అవసరాలను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంది. వీటికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.

ఇదీ చూడండి : మోత్కురులో రేషన్ డీలర్​పై దాడి

Last Updated : Jul 7, 2019, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.