హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించారు. స్థానిక గౌరీ శంకర్ కాలనీలో నివాసముండే మాజీ సర్పంచ్ అనుప రాములు మృతిచెందగా ఆయన కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో పశుసంవర్ధక శాఖ వైద్యుడు శివరాజ్ తండ్రి మృతి చెందిన సమాచారంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. హోంమంత్రి వెంట ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు ఉన్నారు.
ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!