ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆగస్టు 1 నుంచి ఉమ్మడి జిల్లాలో 224 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,517కు చేరుకుంది. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌లో 70 కేసులు నమోదు కాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో 63, మహబూబ్‌నగర్‌లో 47, వనపర్తిలో 27, నారాయణపేట జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 63 పాజిటివ్ కేసులు నమోదయయ్యాయి. వేరే ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించుకున్న వారిలో 13 మంది, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు చేయించుకున్నవారిలో 50 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో...
నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 70 మందికి కరోనా సోకింది. మండలాల వారిగా... అత్యధికంగా కల్వకుర్తి 18, నాగర్‌కర్నూల్‌లో 11, అచ్చంపేట 10, అమ్రాబాద్ 7, కొల్లాపూర్ 7, తాడూరు, తిమ్మాజిపేటలో ముగ్గురు చొప్పున, వెల్దండ, బిజినేపల్లి, బల్మూర్‌లో ఇద్దరు చొప్పున కొవిడ్ బారిన పడ్డారు. ఉప్పునుంతల, పెంట్లవెల్లి, ఉర్కొండ, పదర, పెద్దకొత్తపల్లిలలో ఒక్కొక్కరికి కరోనా సోకింది.
మహబూబ్ నగర్ జిల్లాలో...
మహబూబ్ నగర్ జిల్లాలో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో 24 మంది కొవిడ్ బారిన పడగా.. పాత పాలమూరుకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు, గ్రామీణ మండలంలో ఏడుగురికి, మరో కుటుంబంలో నలుగురు కొవిడ్ బారిన పడ్డారు. జడ్చర్ల పట్టణంలో 10, గండీడ్, జానంపేటలో ఇద్దరు చొప్పున, సీసీకుంట, భూత్పూర్, నవాబ్‌పేట మండలాల్లొ ఒక్కరికి చొప్పున కరోనా వచ్చింది.
వనపర్తి జిల్లాలో...
వనపర్తి జిల్లాలో శనివారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వనపర్తి పట్టణంలో 19, మదనపూర్‌లో ముగ్గురు చొప్పున, ఖిల్లా ఘన్‌పూర్, ఆత్మకూరులో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు. ఖిల్లాగణపూర్లో ఒకరు కరోనాతో మృతి చెందారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 17 మంది కరోనా బారిన పడగా.. ఉట్కూరులో 5, మక్తల్‌లో ముగ్గురు, మరికల్‌లో ఇద్దరు, నారాయణపేట, కొటకోండ, సోమేశ్వర్‌బండ, ఖానాపూర్, కోస్గి, గుండుమాల్, మద్దూరులో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం