Anganwadi Staff Strike in Mahabubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ డిమాండ్లు తీర్చాలని కోరుతూ నిరవధిక సమ్మె బాటపట్టడంతో పూర్వ పాలమూరు జిల్లాలో సగానికి పైగా కేంద్రాలు(Anganwadi Centers) మూతపడ్డాయి. సీఐటీయూ(CITU), ఏఐటీయూసీ(AITUC) సహా పలు కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం నుంచి సమ్మెకి దిగారు. దీంతో వాళ్లు విధులు నిర్వహించే అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పడ్డాయి. సమ్మె మొదటి రోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణీలు, ఐదేళ్లలోపు పిల్లలకు అందాల్సిన పౌష్టికారం అందలేదు.
Anganwadi Staff Protest in Palamuru : అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లకు నెలకు 13 వేల 650 వేతనం చెల్లిస్తున్నారు. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు నెలకు 7 వేల 800 ఇస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రధాన డిమాండుతో టీచర్లు, ఆయాలు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, 65 ఏళ్ల వరకు పనిచేయాలన్న నిబంధనను రద్దు(Anganwadi Teachers and Helpers Retirement Age) చేసి స్వచ్ఛంద పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు కుదించాలని కోరుతున్నారు. ఉద్యోగం నుంచి వైదొలిగే సమయంలో టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5లక్షలు చెల్లించాలని, చివరి వేతనంలో సగం పింఛన్‌గా ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు ఒప్పకున్నట్లే ఒప్పుకుని ప్రభుత్వం ముఖం చాటేస్తుందని వారు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులు : అంగన్వాడీ కేంద్రాల తాళాలు సహా రికార్డులు, ఫోన్లు అప్పగించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సమ్మెలో పాల్గొన్న టీచర్లు, ఆయాలు చెబుతున్నారు. ఏళ్లుగా సేవలందిస్తున్న తమను విధుల నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాళాలు, రికార్డులు, పోన్లు అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు.
కొన్ని అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే మూత : మరోవైపు బీఆర్టీయూ సంఘం సమ్మెలో పాల్గొనలేదు. దీంతో ఆయా అంగన్వాడీ కేంద్రాలు తెరచుకున్నాయి. బీఎల్ఓ విధులున్నందున తాము సమ్మెకు దూరంగా ఉన్నామని, కేంద్రాలు సైతం తెరిచామని, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. కాగా 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే కేంద్రాలు మూతపడ్డాయని, ఆయా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వీఓఏలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సహకారంతో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో, తల్లుల కమిటీల ద్వారా నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు వెల్లడించారు.
Palamuru District Anganwadi Centers : ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పినా చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాలు తాళాలు వేసే దర్శనమిచ్చాయి. పౌష్టికాహారాన్ని అందించే బాధ్యతలను ఇతర శాఖల సిబ్బందికి అప్పగించే ప్రయత్నం చేసినా ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సమ్మెలో పాల్గొంటున్న సిబ్బంది తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులకు ముందే సమాచారం ఇవ్వడంతో ఎవరూ ఆ కేంద్రాలకు రావడం లేదు. సమ్మె ఇలాగే కొనసాగితే.. పౌష్టికాహార పంపిణీ సగానికి పైగా కేంద్రాల్లో నిలిచిపోనుంది.
Anganwadi Centers Problems in Nagarkurnool : సమస్యలకు నిలయాలుగా అంగన్‌వాడీ కేంద్రాలు
Modern Anganwadi Center in Medak : ప్రైవేటుకి దీటుగా కనువిందు చేస్తున్న అంగన్వాడీ కేంద్రం