ETV Bharat / state

'లాక్​డౌన్​ తర్వాత ప్రభుత్వ చర్యలపై ప్రజా ఉద్యమం'

పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని తోడుకుంటోందన్న విషయం మూడేళ్ల క్రితమే కేసీఆర్‌కు తెలిసి కూడా జీవో నెం. 203ను విడుదల చేయకముందే ఎందుకు అడ్డుకోలేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌తో ఉన్న చీకటి ఒప్పందం వల్లే.. కృష్ణా నీటిని తరలించుకుపోతున్న స్పందించడం లేదని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణపై తెరాస ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు.

author img

By

Published : May 12, 2020, 3:51 PM IST

'లాక్​డౌన్​ తర్వాత ప్రభుత్వ చర్యలపై ప్రజా ఉద్యమం తీస్తాం'

పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను ఆంధ్రప్రదేశ్‌ దోచుకుపోతుందని తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు వివరించాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కూమార్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం జగన్‌తో ఉన్న చీకటి ఒప్పందం వల్లే.. కృష్ణా నీటిని తరలించుకుపోతున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దక్షిణ తెలంగాణపై తెరాస ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం రోజు లక్ష క్యూసెక్కుల నీరు తోడుకుపోతే.. పాలమూరు ఏడారవుతుందని సంపత్​ కుమార్​ ధ్వజమెత్తారు. 12 లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపించారు.

"పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని తోడుకుంటోందన్న విషయం మూడేళ్ల క్రితమే కేసీఆర్‌కు తెలుసు. తెలిసి కూడా జీవో నెం. 203ను విడుదల చేయకముందే ఎందుకు అడ్డుకోలేదు. చారితాత్మకమైన తప్పిదానికి ఒడిగడుతున్నటువంటి తెరాస ప్రభుత్వ చర్యలను ఎండగడుతాం. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేస్తాం. లాక్‌డౌన్‌ పూర్తయినా వెంటనే అన్ని వర్గాలను కలుపుకుని కార్యాచరణ తీసుకుంటాం."

-సంపత్‌ కుమార్‌, ఏఐసీసీ కార్యదర్శి.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.