ఆర్టీసీ కార్మికుల 19వ రోజు సమ్మె ములాఖత్ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ మహిళా కార్మికులు ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు పుష్ప గుచ్చాలు ఇచ్చి నిరసన తెలిపారు. కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి కాంగ్రెస్, భాజపాలతో కుమ్మక్కై సమ్మెను కొనసాగిస్తున్నాయని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. దీనిపై ఆగ్రహించిన కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర