ETV Bharat / state

ఫ్రంట్​లైన్ వారియర్స్​కు ముందుగా వ్యాక్సిన్: సత్యవతి రాఠోడ్

author img

By

Published : Jan 15, 2021, 3:05 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్​లో జరిగిన కొవిడ్ వాక్సినేషన్​పై మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫ్రంట్​లైన్ వారియర్స్​కు వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఫ్రంట్​లైన్ వారియర్స్​కు ముందుగా వ్యాక్సిన్: సత్యవతి రాఠోడ్
ఫ్రంట్​లైన్ వారియర్స్​కు ముందుగా వ్యాక్సిన్: సత్యవతి రాఠోడ్

కొవిడ్​ను అరికట్టడానికి ఎవరైతే కృషి చేశారో వారికి ముందుగా వ్యాక్సిన్​ను ఇవ్వాలని నిర్ణయించినట్లు గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్​లో జరిగిన కొవిడ్ వాక్సినేషన్ సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పది నెలల కష్టం రేపటితో తీరబోతోందని మంత్రి అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నాలుగు సెంటర్లలో వ్యాక్సిన్​ను ప్రారంభిస్తున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అందరూ ధైర్యంగా వ్యాక్సిన్​ను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ సమీక్షలో కలెక్టర్ గౌతమ్, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందు, డాక్టర్ శ్రీరామ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'పంచాయతీల ప్రగతిపై సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.