మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ తెరాస ఎన్నికల సన్నాహక సభకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. అత్యధిక మెజార్టీతో తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 2017 జూన్ నాటికి పట్టభద్రులైన వారంతా తమ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకే సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని మంత్రి అన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారని ఆందోళన చెందవద్దని, వీఆర్వోలందర్ని జూనియర్ అసిస్టెంట్లుగా పరిగణిస్తారని తెలిపారు. గ్రామాలు, తండాల వారిగా పట్టభద్రులైన అందర్ని ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేయించే బాధ్యత ఆయా గ్రామాల కార్యకర్తలదేనని సూచించారు. ఈ సభలో ఎంపీ కవిత, జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.