Tamilnadu Woman Missing Case Chased by Mahbubabad Police : తమిళనాడు రాష్ట్రంలో రెండు నెలలుగా కనిపించకుండా (Missing Case) పోయిన తల్లీకుమారుడిని... మహబూబాబాద్ పోలీసులు పట్టుకొని ఆ రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. రెండున్నర నెలల నుంచి వెతుకుతున్నా దొరకని ఆ తల్లీకుమారుల ఆచూకీని.. బ్లూకోట్స్ సిబ్బంది సహాయంతో కేవలం 15 నిమిషాల్లో పట్టుకున్నారు. అనంతరం సంబంధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. దీనిపై తమిళనాడు పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు రాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Women Handbag Snatching CC Viral Footage : పట్టపగలే చోరీకి యత్నం.. సీసీటీవీలో రికార్డ్ దృశ్యాలు
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా గుజిలం పారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణి మేఘలై అనే మహిళ.. ఒక సంవత్సరం వయసున్న ఆమె కుమారుడిని రిత్విక్ ఫలని స్వామి అనే యువకుడు మాయమాటలు చెప్పి జులై 23న మహబూబాబాద్‌కు తీసుకువచ్చాడు. వారు కనిపించకపోవడంతో మణి మేఘలై తండ్రి సుబ్రహ్మణ్యం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో సుబ్రహ్మణ్యం మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ (Habeas corpus) పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. మహబూబాబాద్‌కు వచ్చిన మణి మేఘలై మోసపోయానని గ్రహించి ఓ వ్యక్తి చరవాణి నుంచి గుజిలం పారి పోలీస్‌స్టేషన్‌ను ఫోన్ చేశారు.
Missing mother's son found in Tamil Nadu : దీంతో తమిళనాడు పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్ చేసి మహబూబాబాద్‌లో ఉన్నారని గుర్తించారు. వెంటనే మహబూబాబాద్ పట్టణ సీఐ సతీశ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సీఐ వెంటనే బ్లూ కోట్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గాలింపు కోసం వెళ్లిన సిబ్బంది.. రైల్వే స్టేషన్ సమీపంలో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. తల్లి, కుమారుడిని సఖి (Sakhi Center) కేంద్రానికి తరలించారు. ఫలని స్వామిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ చేరుకున్న తమిళనాడు పోలీసులకు స్థానిక సీఐ సతీశ్ సమక్షంలో తల్లీకుమారుడిని అప్పగించారు.
"గుజిలం పారి ఎస్సై ఫోన్ చేసి.. ఒక మహిళ.. ఆమె కుమారుడు తప్పిపోయారని తెలిపారు. వారు మహబూబాబాద్‌లో ఉన్నట్టు తెలిసింది అనగానే మేము బ్లూ కోర్ట్స్ సిబ్బంది రాంబాబు, నాగరాజుని అలర్ట్ చేయడంతో వారు మహిళ ఉన్న లొకేషన్‌కు వెళ్లి ఆమెను అబ్బాయిని, వారిని తీసుకువచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. మహిళను అబ్బాయిని సఖి కేంద్రానికి తరలించాం. నిందితుడిని స్టేషన్‌లో పెట్టి తమిళనాడు పోలీసులకు సమాచారం అందించాం. వాళ్లు రాగానే మహిళను, అబ్బాయిని వారికి అప్పగించాం. - సతీశ్, మహబూబాబాద్ సీఐ
Farmers Fight Over Farm Path Video Viral : పొలం బాట విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి.. వీడియో వైరల్