మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మూత్రశాలలో పాము కలకలం సృష్టించింది. మూత్ర శాలకు వెళ్ళిన బాలిక పామును చూసి కేకలు వేయడం వల్ల ఉపాధ్యాయులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు పాఠశాలకు చేరుకుని ఆ పామును పట్టుకున్నారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పాము రక్త పింజర అని... ఇది చాలా ప్రమాదకరమని.... కాటు వేసిన వెంటనే మనిషి చనిపోతారని..పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. పాఠశాల ప్రహరి కూలిపోయి ఉన్నందున పాము లోపలికి వచ్చి ఉండవచ్చని వాచ్మెన్ తెలిపారు.
ఇవీ చూడండి: మేడారం: సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇక్కట్లు