ETV Bharat / state

సంకల్పం ముందు అంగవైకల్యం బలాదూర్‌... - PHYSICAL HANDICAPED BUT HE IS A BODY BUILDER

అతనో దివ్యాంగుడు... అయినప్పటికీ కుంగిపోలేదు. వైకల్యం లక్ష్యసాధనకు అడ్డుకాదని తెలుసుకున్నాడు. శారీరక లోపాన్నే మార్గంగా మలచుకుని దేహదారుఢ్య పోటీల్లో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే... రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నాడు. దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ వ్యక్తి గురించి తెలుసుకుందామా..!

సంకల్పం ముందు వైకల్యం బలాదూర్‌...
author img

By

Published : Aug 22, 2019, 1:06 PM IST

Updated : Aug 22, 2019, 7:49 PM IST

అబ్దుల్‌ ఇమ్ము.. అసలు పేరు ఇమ్రాన్‌. మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన ఇతనో దివ్యాంగుడు. పోలియో కారణంగా చిన్నప్పుడే ఎడమకాలు పనిచేయకుండా పోయింది. దివ్యాంగుడైనంత మాత్రాన తాను ఏమి చేయలేనా..? అని ఆలోచించాడు. దేహదారుఢ్య పోటీల్లో సత్తాచాటుతున్న యువకుల దృశ్యాలను యూట్యూబ్‌లో చూశాడు. కాళ్లు లేనివాళ్లే బాడీబిల్డింగ్ రంగంలో రాణిస్తుంటే.. తానూ ఆ రంగాన్ని ఎందుకు ఎంచుకోకూడదని భావించాడు.

సంకల్పం ముందు అంగవైకల్యం బలాదూర్‌...

కోచ్​ సహకారంతో:

జిల్లాలోని అల్తాఫ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ కోచ్‌ ఆల్తాఫ్‌ను సంప్రదించాడు. బాడీబిల్డింగ్‌పై ఇమ్రాన్‌ మక్కువను గమనించిన కోచ్​ అల్తాఫ్‌ ఇమ్రాన్‌ అతన్ని పోత్సహించాడు. రోజూ నాలుగైదు గంటల శిక్షణ, పోషకాహారం అందించాడు. మొదట మండల స్థాయి దివ్యాంగుల బాడీ బిల్డింగ్‌ పోటీల్లో రంగంలోకి దిగాడు. అక్కడ ప్రథమ బహుమతి గెలుచుకున్న ఇమ్రాన్‌.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు:

జిల్లాస్థాయి పోటీల్లో 17సార్లు పాల్గొనగా 11 బంగారు పతకాలు, 2016లో రాష్ట్ర స్థాయి 11 పోటీల్లో పాల్గొంటే.. 7 స్వర్ణం, 3 రజత, ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 2019 ఫిబ్రవరిలో జరిగిన 10వ జాతీయ స్థాయి దివ్యాంగ దేహదారుఢ్య పోటీల్లో తలపడ్డ ఇమ్రాన్‌ రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

సాయం అందిస్తే:

ప్రస్తుతం ఎంసీఏ చదువుతున్న ఇమ్రాన్‌.. మధ్యాహ్నం వరకు చదువుకు సమయం కేటాయిస్తాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగైదు గంటల పాటు వ్యాయామశాలలో సాధన చేస్తాడు. రోజూ 25 ఉడకబెట్టిన గుడ్లు, 4లీటర్ల పాలు, అరకిలో మాంసం, ఉడక బెట్టిన పాలక్‌ నిత్య భోజనంలో భాగంగా ఉంటాయి. ఆహారం, వ్యాయామం కోసం నెలకు 10 నుంచి 15వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాడు. ఇమ్రాన్‌ ఖర్చంతా తన తల్లిదండ్రులు, స్నేహితులు, కోచ్‌ పెట్టుకుంటున్నారు. దాతలు ఎవరైనా సాయం చేస్తే మిస్టర్‌ ఇండియా టైటిల్‌ దక్కించుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తాడని కోచ్‌ ఆల్తాఫ్ ధీమాగా చెబుతున్నారు.

ఆదర్శంగా నిలుస్తోన్న ఇమ్రాన్​:

శరీర భాగాలు పనిచేయడం లేదని ఆత్మన్యూనతకు లోనై జీవితంలో కుంగిపోయే దివ్యాంగులకు ఇమ్రాన్‌ ఒక స్ఫూర్తి. తమలోని టాలెంట్​ను గుర్తించి.. ఆ రంగంలో ఎదగాలన్న లక్ష్యం, కృషి, పట్టుదల ఉంటే దివ్యాంగులు కూడా ఏదైనా సాధిస్తారని చెప్పడానికి ఇమ్రాన్ ఓ ఆదర్శం.

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై విచారణ 28కి వాయిదా

Last Updated : Aug 22, 2019, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.