మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్న నాగారంలో నిర్వహించిన ముత్యాలమ్మ బోనాల పండగలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించారు. గ్రామంలోని రైతులు ఎడ్ల బండ్లు, వాహనాలను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ తిప్పారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు వచ్చే ఆది, బుధ వారాల్లో ఈ పండగను జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ.
ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి