ETV Bharat / state

'ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి.. సంరక్షణ బాధ్యతనూ స్వీకరించాలి' - గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం

హరిత వనాలను పెంచేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. దాన్ని ఎమ్మెల్యే శంకర్​నాయక్ స్వీకరించారు. మానుకోటలోని విజ్ఞం స్కూల్​లో మొక్కను నాటారు.

mahabubabad MLA Banoth Shankar Naik accepts green challenge
గ్రీన్ ఛాలెంజ్​ని స్వీకరించిన ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్
author img

By

Published : Jul 9, 2020, 7:37 PM IST

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ని స్వీకరించిన మాహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ విజ్డం స్కూల్​లో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్​ విసిరారు.

తాను నాటి మొక్క సంరక్షణ బాధ్యతను ఓ ఉపాద్యాయుడికి అప్పగించానని చెప్పారు. ఆ మొక్కకు పుట్టినరోజు వేడుక చేస్తామని తెలిపారు. ప్రతిఒక్కరూ ఒక్కో మొక్క నాటి అడవుల శాతాన్ని పెంచుదామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండీ: హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎక్సైజ్ సూపరింటెండెంట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.