ETV Bharat / state

'దాశరథి రచనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి'

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండల కేంద్రంలో దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దాశరథి విగ్రహానికి కలెక్టర్​ వీపీ గౌతమ్ పులమాల వేసి నివాళులర్పించారు. ఆయన రచనలను కొనియాడారు.

author img

By

Published : Jul 22, 2020, 9:31 PM IST

mahabubabad collector vp gautham said Dasharatha's writings inspired many
'దాశరథి రచనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి'

నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ గొంతెత్తి చాటిన మహానీయుడు దాశరథి క్రిష్ణమాచార్యులు అని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. నిజాం నవాబుల నిరంకుశత్వాన్ని ఎదిరించి, తన కలంతో ప్రజలను చైతన్య పరిచాడని కొనియాడారు.

చిన్నగూడురు మండల కేంద్రంలో దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దాశరథి స్వగ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి రచనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని కలెక్టర్​ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దాశరథి స్మృతి వనం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

ఇదీ చూడండి : గుర్తించి పరీక్షలు చేయించాలి.. అధికారులకు ఈటల ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.