మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఆరో విడత హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్యతో పాటు కౌన్సిలర్లందరు హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికి తిరిగి మొక్కలు పంపిణీ చేశారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాలని స్థానికులను సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని వివరించారు.
'సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించండి'
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో హరితహారంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతరం స్థానికులకు ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంచారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని వివరించారు.