ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్రత పాటించండి.. వ్యాధులకు దూరంగా ఉండండి'

మహబూబాబాద్​ జిల్లాలో ప్రజలందరూ సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ వి.పి.గౌతమ్​ తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున ఇళ్లలోని పూల కుండీలు, కూలర్లలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు.

author img

By

Published : Jun 14, 2020, 7:27 PM IST

District Collector VP Gautam was accidentally visited in Mahabubabad town.
సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మహబూబాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆకస్మికంగా పర్యటించారు. ఇల్లందు బైపాస్ రోడ్​లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, మురికి కాలవలో చెత్తను ఏ రోజుకారోజు తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

ఆ ప్రాంతంలోని టైర్ల షాప్​లను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. టైర్లలో నీటి నిలువ ఉన్న రవి టైర్ల వర్క్స్ షాపును సీజ్ చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ టైర్లలో నీటి నిల్వలు ఉంటే దోమలు పెరిగి డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలు వస్తాయని పేర్కొన్నారు. నీటినిల్వపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.