ETV Bharat / state

జిల్లా కేంద్రంలో ఐసోలేషన్​ వార్డు: కలెక్టర్​

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది డ్యూటీ రిజిస్టర్, హాజరు పట్టికలను పరిశీలించారు. కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా ఆస్పత్రి పరిసరాల్లో ఐసోలేషన్​ వార్డును సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

district collector gowtham sudden visited
'జిల్లా కేంద్రంలో ఐసోలేషన్​ వార్డు': కలెక్టర్​
author img

By

Published : Mar 18, 2020, 10:13 AM IST

ప్రతి జిల్లా కేంద్రంలో ఐసోలేషన్​ వార్డు సిద్ధం చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్​ గౌతమ్​ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పరిశీలించారు. ఆస్పత్రి సూపరిండెంట్, వైద్యులు సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ ప్రభలకుండా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీసారు. 10 పడగల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోగులకు అందిస్తున్న మందులను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలను స్కానింగ్​ల కోసం ప్రైవేట్ సెంటర్లకు పంపిస్తున్నారని రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్కానింగ్.... సోనోగ్రఫీ వివరాలను పూర్తిగా తెలియజేయాలని సూపరింటెండెంట్​ను ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, వీధుల్లో తిరిగి పరిశుభ్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు.

'జిల్లా కేంద్రంలో ఐసోలేషన్​ వార్డు': కలెక్టర్​

ఇదీ చూడండి: త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.